అమ్రాబాద్ మండలం మద్దిమడుగులో చెంచు కుటుంబాలైన మాకు ప్రభుత్వం 11 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. మేము ఇళ్లను బేస్‌మెంట్ వరకు కట్టాం. ఇప్పుడు అటవీశాఖ అధికారులు వచ్చి మీరు ఇక్కడ ఇళ్లు కట్టుకోవడానికి అవకాశం లేదని చెబుతున్నారు. మాకు న్యాయం చేయాలి.
– ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, మద్దిమడుగు, అమ్రాబాద్ మండలం
న్యాయం చేయండి సారు..
మాకు చేగుంట శివారులోని సర్వేనం.215లో 34 గుంటల భూమి ఉంది. అట్టి భూమి పొరపాటున 34 గుంటలకు బదులు 11 గుంటలు మాత్రమే పడింది. మిగుతా భూమి ఇతరుల పేరు మీద చూపిస్తుంది. అధికారులు విచారణ చేసి, మాకు న్యాయం చేయాలి. – నారంజి, చేగుంట,
తిమ్మాజిపేట మండలం


