మామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులు | - | Sakshi
Sakshi News home page

మామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులు

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

పెద్దకొత్తపల్లి: మామిడి తోటల్లో సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు పాటించాలని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ శైలా అన్నారు. శనివారం మండలంలోని కల్వకోల్‌ గ్రామంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో ఉద్యాన పంటలు, ముఖ్యంగా మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, మామిడి పూతకు ముందు, పూత సమయంలో పాటించాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. నీటి యాజమాన్య పద్ధతులు, డ్రిప్‌ వినియోగించడం, ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించడం, మామిడి పండ్లను వివిధ నష్టాల నుంచి కాపాడుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అదనపు ఆదాయం కోసం కూరగాయల సాగును ప్రోత్సహించడం, పంట మార్పిడి విధానాలను పాటించడం వంటి వాటిని వెల్లడించారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారులు వెంకటేశం, లక్ష్మణ్‌, ఏఓ శిరీష, సర్పంచ్‌ శ్రీనివాసులు, ఉప సర్పంచ్‌ కుర్మయ్య, రైతులు పాల్గొన్నారు.

దశాబ్దం తర్వాత

ఆర్టీసీలో ఎన్నికలు

కందనూలు: గత ప్రభుత్వం యూనియన్లను అణచివేసి ఆర్టీసీ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని టీడబ్ల్యూయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగయ్యగౌడ్‌ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్‌ డిపో గేటు మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దం తర్వాత ఆర్టీసీలో జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవని అన్నారు. ఈ నెల 9న జరిగే యూనియన్‌ ఎన్నికల్లో డిపో ఉద్యోగులు తమ అమూల్యమైన రెండు ఓట్లు బాణం గుర్తుకే వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడబ్ల్యూయూ రీజినల్‌ అధ్యక్షుడు నారాయణ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

శనేశ్వరుడికి పూజలు

కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్‌ గ్రామంలో శనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు తిలతైలాభిషేక పూజలు నిర్వహించినట్లు పూజారి గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. ప్రతిఒక్కరు జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తి మేరకు పూజించాలని చెప్పారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ గోపాల్‌రావు, సర్పంచ్‌ సుగుణమ్మ, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement