సెంట్రల్‌ కిచెన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు చర్యలు | - | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ కిచెన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు చర్యలు

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

● వీరంరాజుపల్లిలో స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

బల్మూర్‌: మండలంలోని వీరంరాజుపల్లి గ్రామంలో సెంట్రల్‌ కిచెన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ హేమంత కేశవ్‌పాటిల్‌ అన్నారు. గ్రామంలోని సర్వే నం.15లో అనువైన స్థలాన్ని శనివారం సబ్‌ కలెక్టర్‌ సలోని ఛాబ్రాతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా సెంట్రల్‌ కిచెన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను స్థానికంగా సాగుచేసి వినియోగించుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రామంలోని పాఠశాలను సందర్శించి వసతులపై ఆరా తీశారు. గ్రామస్తులు సెంట్రల్‌ కిచెన్‌ యూనిట్‌ ఏర్పాటుకు తమ భాగస్వామం అందించి సహకరించాలని కోరారు. అనంతరం గ్రామంలో రైతు శ్యాంసుందర్‌రెడ్డి తన 8 ఎకరాల భూమిలో ఆయిల్‌పాం సాగుకోసం తీసుకొచ్చిన 400 మొక్కలను కలెక్టర్‌ పరిశీలించారు. ఆయిల్‌పాం సాగుకు అవసరమైన నీటి లభ్యత, మొక్కలు నాటే విధానం, సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇప్పటి వరకు అయిన వ్యయం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలిశెట్టిపల్లి క్లస్టర్‌ రైతువేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై జరిగిన కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు, అచ్చంపేట డివిజన్‌ వ్యవసాయ అధికారి చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీఓ రేవత్‌రెడ్డి, వ్యవసాయాధికారి నరేష్‌, సర్పంచ్‌లు మనోహర్‌, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement