విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

● తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌/ కొల్లాపూర్‌ రూరల్‌: చదువుతోపాటు క్రీడలపైన యువత, విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని ఎల్లూరులో క్రీడా మైదానం, అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అలాగే కొల్లాపూర్‌ ఎంపీడీఓ కార్యాలయంలో చిన్నారులకు తొలిముద్ద తినిపించి.. అనంతరం చౌటబెట్లకు వెళ్లే దారిలోని ఎస్టీ హాస్టల్‌ భవనం పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలతో శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు మారుమూల ప్రాంతాలకే పరిమితం కాకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభచాటాలని ఆకాంక్షించారు. ప్రతిఒక్కరు ఆరోగ్యం కోసం రోజుకు కనీసం ఒక గంట వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా వసతులను మెరుగుపరిచేందుకు, యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, పేద, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి జ్యోతి, వైస్‌ చైర్మన్‌ షేక్‌ రహీంపాషా, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement