● పాఠశాలల నిర్వహణ, ఇతర ఖర్చుల నిమిత్తం నిధులు
● ఉమ్మడి జిల్లాలో 292 ప్రైమరీ బడులకు రూ.1,69 కోట్లు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం 2024–25 విద్యాసంవత్సరం నుంచి దశల వారీగా ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించింది. ఇందులో ముఖ్యంగా ఎల్‌కేజీ, యూకేజీ విద్యను అందించి, ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు ఈ చర్యలు చేపట్టింది. మొత్తం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 292 ప్రైమరీ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రమంలో అందులో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలల వేతనాన్ని మంజూరు చేసింది. ఇందులో ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.8 వేలు, ఆయాకు రూ.6 వేలను మంజూరు చేసింది. ఈ నిధులు మొదట ఎంఈఓల ఖాతాలో జమ కాగా, అక్కడి నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలు, పాఠశాల హెచ్‌ఎంల ఖాతాలకు వెళ్లిన అనంతరం ఆధార్‌లింక్ ఉన్న ఇన్‌స్ట్రక్టర్, ఆయా ఖాతాలో నేరుగా జమచేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. వేతనాల్లో ఆలస్యం లేకుండా నిధులు విడుదల చేయడంపై ఇన్‌స్ట్రక్టర్, ఆయాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై డీఈఓ విజయకుమారిని వివరణ కోరగా ఇటీవల ప్రారంభించిన ప్రీ ప్రైమరీ బడుల సిబ్బందికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసిందని, వాటిని నిబంధనల ప్రకారం విడుదల చేయాలని సూచించారు.
●


