గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అప్పాజిపల్లి | - | Sakshi
Sakshi News home page

గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అప్పాజిపల్లి

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

తిమ్మాజిపేట: కొండపై చిన్నపాటి గుహలో స్వయంభూగా వెలసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉన్న అప్పాజిపల్లి గ్రామం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ హన్మంతురావు అన్నారు. మండలంలోని అప్పాజిపల్లి గ్రామ సమీపంలో నర్సన్నగుట్టపై వెలసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామిని శనివారం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, సభ్యులు చిలుక రాజేందర్‌రెడ్డి, జిల్లా ఎండోమెంట్‌ అధికారులతో కలిసి కమిషనర్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్న ఆలయం అని భావించానని, కానీ గుట్టపై చిన్న గుహలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్న తీరు ఈ క్షేత్రం మహిమాన్విత్వాన్ని తెలియజేస్తుందన్నారు. ఏరియల్‌ సర్వే ద్వారా ప్రణాళిక రూపొందించి మొదట రూ.50 లక్షలతో ఆలయ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. రాజగోపురం, కల్యాణ మండపం, భక్తులకు డైనింగ్‌ హాల్‌, ఇతర సౌకర్యాల కోసం ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. అంతకు ముందు వారికి అర్చకులు, పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈఈ దుర్గాప్రసాద్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరాజు, స్తపతివల్లి నాయగం, ఆలయ కమిటీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, సభ్యులు రాందేవరెడ్డి, రామచంద్రారెడ్డి, వివేక్‌రెడ్డి, ఎల్లారెడ్డి, సర్పంచులు వెంకటయ్య, భాస్కర్‌గౌడ్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

కందనూలు: పాలెం శ్రీవేంకటేశ్వరస్వామిని దేవాదాయ శాఖ కమిషనర్‌ హన్మంతురావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ ఈఓ జయపాల్‌రెడ్డి వారికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్‌ ఆలయానికి సంబంధించిన భూమి, ఆదాయ వనరులు, అర్చకులు, సిబ్బంది సమస్యలు, ఆలయ పునర్నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని ఈఓను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement