అమ్రాబాద్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యునివర్శిటీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని ప్రిన్సిపాల్, అంబేడ్కర్ యూనివర్శిటీ కోఆర్డినేటర్ గోపాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఓపెన్ యూనివర్శిటీ అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఓపెన్ డిగ్రీ బీకాం, బీఏ, బీఎస్సీ గ్రూపులు ఉన్నాయని తెలిపారు. ప్రవేశాలకు వచ్చేనెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కన్నారు. విద్యార్థులు ఆధార్‌కార్డు, పదో తరగతి, ఇంటర్ మెమో, కులము, ఆదాయం సర్టిఫికెట్లు, ఫొటోతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న ఓపెన్ యూనివర్శిటీ స్టడిసెంటర్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


