నా భర్త పేరు అంకూర్ భీమ్‌రాజ్. మాకు ఊర్కొండ మండలం మాధారం శివారులోని సర్వేనం. 376/30లో ఐదెకరాల గైరాన్ భూమిని 1980లో అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఆ భూమిలో 36 గుంటల పొలాన్ని కట్ చేసి.. 1994లో 4.04 ఎకరాల పొలాన్ని పట్టాదారు పాస్‌బుక్‌లో నమోదు చేశారు. అప్పటి నుంచి పొలాన్ని సాగుచేస్తున్నాం. 2025లో నాభర్త గుండెపోటుతో మరణించారు. నాటి నుంచి కొందరు వ్యక్తులు మేము సాగుచేస్తున్న భూమి వద్దకు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. మేము స్థానిక తహసీల్దార్ వద్దకు వెళ్తే.. ఆయన కూడా బయటి వారికి సపోర్టుగా మాట్లాడుతున్నారు. మాకు న్యాయం చేయాలి. – అంకూర్ అన్నపూర్ణ, మాధారం, ఊర్కొండ మండలం


