కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి పలు గ్రామాల నుంచి 12మంది రాగా.. ఎస్పీ స్వయంగా వారి సమస్యలను తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. 8 భూ తగాదాలపై, 4 తగు న్యాయం కోసం ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.
గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
కందనూలు: జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కవిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026లో పదో తరగతి ఉత్తీర్ణులై 450 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు పదో తరగతి మెమో, బోనపైడ్, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు 90594 43450 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
6 నుంచి పాదయాత్ర
నాగర్‌కర్నూల్ రూరల్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6నుంచి 14వ తేదీ వరకు సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్‌నర్సింహ తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా, దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని ఆరోపించారు. యువతను మతం, కులం పేరుతో రెచ్చగొడుతూ, నిరుద్యోగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని పాదయాత్ర ద్వారా తెలియజేస్తామని తెలిపారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్, రవీందర్, కేశవులుగౌడ్, నర్సింహ, శ్రీనివాసులు, ఖాజా, శివుడు, లక్ష్మీపతి, కిరణ్‌కుమార్, మల్లయ్య, పరుశరాములు, మధుగౌడ్ ఉన్నారు.


