ఏసీబీకి చిక్కిన సర్వేయర్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన సర్వేయర్‌

May 27 2026 1:05 AM | Updated on May 27 2026 1:05 AM

రాజోళి/గట్టు: లంచం తీసుకుంటూ ప్రభుత్వ సర్వేయర్‌ ఏసీబీకి పట్టుబడిన ఘటన వడ్డేపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. వడ్డేపల్లి మండలం కొంకలకు చెందిన ఓ రైతు తనకున్న 4.14 ఎకరాల భూమిని సర్వే చేయాలని సర్వేయర్‌ బ్రహ్మయ్యను సంప్రదించారు. ఇందుకు గాను సర్వేయర్‌ ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. అడ్వాన్సుగా రూ.5 వేలు తీసుకున్నాడు. మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో.. విసిగిపోయిన రైతు మహబూబ్‌నగర్‌లో ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో మంగళవారం శాంతినగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో సదరు రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఏసీబీ అధికారులు గట్టులోని సర్వేయర్‌ బ్రహ్మయ్య ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. రైతు దగ్గర నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వ్యవహారంపై ఏసీబీ అధికారులు నేరుగా గట్టులోని బ్రహ్మ య్య ఇంటికి చేరుకుని తనిఖీలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement