సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం

May 27 2026 1:05 AM | Updated on May 27 2026 1:05 AM

వాతావరణం

ఎండ తీవ్రత కాస్త తక్కువగా ఉన్నా..

ఉక్కపోత పెరుగుతోంది. సాయంత్రం

చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.

కందనూలు/కొల్లాపూర్‌/కోడేరు: నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–8 పరిధిలోని వట్టెం అతిథిగృహంలో కలెక్టర్లు హేమంత కేశవ్‌ పాటిల్‌, ఆదర్శ్‌ సురభి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డితో కలిసి పాలమూరు ఎత్తిపోతల, ఎంజీకేఎల్‌ఐ, డిండి, ఉమామహేశ్వర బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, అచ్చంపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌, మార్కండేయ, కర్నెతండా బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లతోపాటు వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, భూసేకరణ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో ప్రాజెక్టుల వారీగా చేపట్టిన పనులు, భూ సేకరణ పురోగతిని అధికారులు వివరించారు. ముఖ్యంగా కాల్వల నిర్మాణం, రిజర్వాయర్ల అను బంధ పనులు, పంప్‌హౌజ్‌ల ఏర్పాటు, విద్యుత్‌ కనెక్షన్లు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూ చించారు. రైతులకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి పనిని గడువులోగా పూర్తిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా భూ సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. నష్టపరిహారం చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చూడాలన్నారు. వారం రోజుల్లో భూ సేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.

నిర్లక్ష్యాన్ని సహించం..

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి జూపల్లి అన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. పనుల నాణ్యత విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. త్వరలో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారని.. ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రధాన సమస్యల పరిష్కారానికి అవసరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.

ప్రాజెక్టు పనుల పరిశీలన..

కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు సమీపంలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–1, 2, 3 పనులతో పాటు కోడేరు మండలంలోని తీగలపల్లిలో కొనసాగుతున్న పంపుహౌజ్‌ నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం నార్లాపూర్‌ రిజర్వాయర్‌ తూము, హెడ్‌ రెగ్యులేటరీలను పరిశీలించారు. తీగలపల్లిలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వారి వెంట అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, ఎస్సీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌, ఆర్డీఓ బన్సీలాల్‌, ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

కబడ్డీ.. కబడ్డీ

జిల్లా కబడ్డీ జట్లు రాష్ట్రస్థాయి టోర్నీల్లో విజేతలుగా నిలిచేందుకు కబడ్డీ అసోసియేషన్‌ వెన్నుదన్నుగా నిలుస్తోంది.

–8లో u

ఒక పంపు నుంచి నీటిని వదిలి పూర్తయిందనిపించారు..

పాలమూరు ప్రాజెక్టులో నాలుగు మోటార్లు మాత్రమే ఏర్పాటుచేశారని.. మరో ఐదు మోటార్ల ఏర్పాటు పనులను గత ప్రభుత్వం గాలికొదిలేసిందని మంత్రి జూపల్లి అన్నారు. ఇక ఉదండాపూర్‌ వరకు ప్రధాన కాల్వ పనులే పూర్తి కాలేదన్నారు. కానీ బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు పాలమూరు ప్రాజెక్టు పనులను 90శాతం పూర్తిచేసినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక పంపు నుంచి నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని వదిలి, మొత్తం ప్రాజెక్టు అయిపోయినట్లు చెబుతున్నారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ. 80కోట్లు ఖర్చవుతుందని చెప్పిన గత ప్రభుత్వం.. రూ. 38వేల కోట్లు మంజూరుచేసి, రూ. 23వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. త్వరలోనే ప్రాజెక్టు పెండింగ్‌ పనులను పూర్తిచేసి 12లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అదే విధంగా కేఎల్‌ఐ మోటార్లకు మరమ్మతులు పూర్తిచేస్తామన్నారు.

వారం రోజుల్లో

భూసేకరణ పనులను పూర్తిచేయాలి

త్వరలో ప్రాజెక్టుల సందర్శనకు సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ

మంత్రి జూపల్లి కృష్ణారావు

Advertisement
 
Advertisement
Advertisement