బాల్యవివాహాలను నిర్మూలిద్దాం | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలను నిర్మూలిద్దాం

May 27 2026 1:05 AM | Updated on May 27 2026 1:05 AM

అచ్చపేట(బల్మూర్‌): బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం బల్మూర్‌ మండలం గట్టుతుమ్మెన్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. అమ్మా యిలకు 18ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయా లని సూచించారు. ఎవరైనా బాల్యవివాహాన్ని ప్రో త్సహించినా, జరిపించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సామాజిక దురాచారంతో బాలలు తమ హక్కులను కోల్పోవడమే కాకుండా.. వారి భవిష్యత్‌, ఆరోగ్యం దెబ్బతింటాయన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సామాజిక బాధ్యతగా డయల్‌ 1098 లేదా అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. బాల్యవివాహాల నిర్మూలనలో అంగన్‌వాడీ టీచర్లు కీలకంగా వ్యవహరించాలన్నారు. అదే విధంగా గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీడీపీఓ దమయంతి, ఎంపీడీఓ రాఘవులు, పోష ణ అభియాన్‌ కో–ఆర్డినేటర్‌ పార్వతి, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ అధికారి యశ్వంత్‌, మల్లేష్‌, కో–ఆర్డినేటర్‌ వెంకటమ్మ, సూపర్‌వైజర్‌ సునీత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement