బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యం

May 27 2026 1:05 AM | Updated on May 27 2026 1:05 AM

కొల్లాపూర్‌: బహుజన రాజ్యాధికార సాధనే బీఎస్పీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్‌ అన్నారు. మంగళవారం కొల్లాపూర్‌లో ఆయన పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. కొన్ని రోజులుగా మహిళలపై జ రుగుతున్న వేధింపులు, దాడులు, అత్యాచార ఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ ఆగడాల ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నా రు. మహిళల గౌరవాన్ని కాపాడేలా, వారికి భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బహుజనుల రాజకీయ సాధికారత, సామాజిక న్యా యం, సమానత్వం కోసం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కొల్లాపూర్‌తో పాటు ఉమ్మడి పాలమూరులో పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరామకృష్ణ, యేసేపు, బండి పృథ్వీరాజు, మిద్దె మహేశ్‌, కళ్యాణ్‌, బోనాసి రాంచందర్‌, మునిస్వామి, విష్ణు, బాలకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement