కల్వకుర్తి/కల్వకుర్తి రూరల్: మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మహిళాశక్తి సూపర్ బజార్‌లు, రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్‌లు, పెట్రో ల్ బంకులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో రూ.14 కోట్ల వడ్డిలేని రుణాలు అందించామని వివరించారు. అదే విధంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వెల్దండ మండలానికి చెందిన 82 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్‌కుమార్, బాలజీ సింగ్, ఆర్డీఓ జనార్దన్ రెడ్డి, కమిషనర్ మహమూద్, తహసీల్దార్ ఉమ, షాన్‌వాజ్‌ఖాన్, విజయ్‌కుమార్‌రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షురాలు భాగ్యమ్మ, పూల్‌సింగ్, వెంకటయ్యగౌడ్, హరికిషన్ పాల్గొన్నారు.


