కందనూలు: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా తెలుసుకున్న ఆయన.. వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందులో భూమికి సంబంధించినవి 3, భార్యభర్తల గొడవపై 2, తగున్యాయం చేయాలని 6 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.


