కల్వకుర్తి రూరల్: క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తాయని.. బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు అన్నారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించగా.. 150మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ విభాగాల్లో బాలబాలికలకు రన్నింగ్, షాట్‌ఫుట్ తదితర పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన క్రీడాకారులను వచ్చేనెల 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే 12వ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు బిక్షపతి యాదవ్, బాలు నాయక్, ప్రసాద్, బాలయ్య, భీమయ్య, జాఫర్, ఝాన్సీ, నిరంజనమ్మ, శోభ పాల్గొన్నారు.


