జీడిపల్లిలో వర్షానికి తడిసిన ధాన్యం
కల్వకుర్తి రూరల్: మండలంలో ఆదివారం కురిసిన అకాల వర్షం రైతన్నకు తీవ్ర నష్టం మిగిల్చింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో జీడిపల్లి గ్రామంలోని రైస్‌మిల్లు ఆవరణలో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. మొత్తం 8మంది రైతులు దాదాపు 200 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆరబోయగా.. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి రైతులు ధాన్యాన్ని కుప్పగా పోసి కవర్లు కప్పే సమయం కూడా లేకపోయింది. మిల్లు రేకుల నుంచి ధారాళంగా వచ్చిన నీళ్లతో పాటు వర్షపునీటిలో దాదాపు 100 క్వింటాళ్ల ధాన్యం తడిసిందని రైతులు వాపోయారు.


