మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా జాతర మైదానంలో ప్రత్యేకంగా తయారుచేసిన పచ్చిపులుసు అన్నంతో మైసమ్మకు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యార్థం నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, వనపర్తి ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు. భక్తులతో జాతర మైదానం కిక్కిరిసింది. భక్తులకు సరిపడా షెడ్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. సుమారు 10వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మంచినీటి కోసం అవస్థలు..

నాయినోనిపల్లి మైసమ్మ జాతరలో మంచినీటి కోసం భక్తులు అవస్థలు పడ్డారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు మినీ వాటర్‌ట్యాంకుపైకి ఎక్కి మరీ నీటిని తెచ్చుకున్నారు. జాతర మైదానంలో ఓవర్‌హెడ్‌ వాటర్‌ట్యాంకు నిరుపయోగంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. భక్తులకు నీటి సమస్య లేకుండా చూడాలని పలువురు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement