వనపర్తి 41.5 26.9 | - | Sakshi
Sakshi News home page

వనపర్తి 41.5 26.9

May 24 2026 12:57 AM | Updated on May 24 2026 12:57 AM

వనపర్తి 41.5 26.9 నారాయణపేట 39.8 26.3 జోగుళాంబ గద్వాల 40.3 26.4

జిల్లాలో గాలివాన బీభత్సం

నారాయణపేట 39.8 26.3

కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన వరి, మొక్కజొన్న ధాన్యం

పిడుగుపాటుతో ఓ వ్యక్తితో పాటు మూగజీవాల మృత్యువాత

మామిడి మధురం

ఉమ్మడి పాలమూరులో మామిడికాయలకు ప్రసిద్ధి చెందిన కొల్లాపూర్‌ నియోజకవర్గంలో 50కిపైగా రకాల వైరెటీలు అందుబాటులో ఉండి.. ఇట్టే ఆకర్షిస్తాయి.

–8లో u

అకాలం.. ఆగమాగం

సాక్షి, నాగర్‌కర్నూల్‌/కొల్లాపూర్‌/అచ్చంపేట రూరల్‌/బల్మూర్‌/లింగాల: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం కురిసిన అకాల వర్షం అతలాకుతలం చేసింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో కొల్లాపూర్‌, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌యార్డులతో పాటు బల్మూర్‌ మండలం కొండనాగుల, లింగాల కొనుగోలు కేంద్రాల్లో వరి, మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. అచ్చంపేట మార్కెట్‌యార్డులో డోజర్‌ సహాయంతో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కుప్పలుగా పోశారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతో మార్కెట్‌యార్డులోనే ఉంచారు. అకాల వర్షానికి ధాన్యం మొత్తం తడిసి ముద్దకావడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. మార్కెట్‌యార్డును తహసీల్దార్‌ సైదులు పరిశీలించారు. ధాన్యం కాపాడే విషయంలో స్థానిక పోలీసులు రైతులకు సహకరించారు. వర్షంతో పాటు ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. కొన్నిచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. తాడూరు మండలం గోవిందాయిపల్లిలో పిడుగు పాటుకు గురై గొర్రెలకాపరి మల్లయ్య (36) మృతిచెందాడు. పిడుగు ధాటికి అతడి జేబులోని సెల్‌ఫోన్‌ సైతం పేలిపోయింది. బల్మూర్‌లో వంజ సుకుమార్‌రెడ్డి ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో మంటలు అంటుకొని దగ్ధమైంది. అచ్చంపేట మండలం బుడ్డతండాకు చెందిన రైతు మోత్యానాయక్‌ రెండు ఆవులు, బల్మూర్‌ మండలం రామాజిపల్లిలో రైతు గోరెంట్ల రాజుకు చెందిన ఓ గేదెతో పాటు దూడ పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాయి. తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో రేకుల ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. బిజినేపల్లి మండలం పాలెం అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సమీపంలో ప్రధాన రహదారిపై భారీ చెట్టు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కాగా, అచ్చంపేట మండలంలో అత్యధికంగా 7.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. లింగాల మండలంలో 7.5, ఉప్పునుంతలలో 6.3, నాగర్‌కర్నూల్‌ 4.0, కల్వకుర్తి, పదర మండలాల్లో 0.5 మి.మీ. వర్షం కురిసింది.

Advertisement
 
Advertisement
Advertisement