ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ జీఓ 131ని జారీ చేసింది. అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలి. తమ దరఖాస్తు వివరాలతో మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలి. నిబంధనల ప్రకారం ఉన్న ప్లాట్లను విధిగా క్రమబద్ధీకరిస్తాం. తద్వారా యజమానులకు ప్లాట్లపై హక్కు లభించడంతో పాటు మున్సిపాలిటీ నుంచి రావాల్సిన అన్ని అనుమతులను సులభంగా పొందవచ్చు.
– డి.మురళి,
మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట


