మక్తల్: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్‌లో అసంపూర్తి భవనాలను ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 19 బీటీరోడ్లను 65 కి.మీ. మేర నిర్మించేందుకు రూ. 68కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. కొల్పూర్ – కుర్తికొండ వద్ద జూరాల ప్రాజెక్టు తరహాలో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించేందుకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. హిందూపూర్ వద్ద ఽథర్మల్ పవర్ స్టేషన్‌కు సైతం త్వరలో గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మక్తల్‌లో డిగ్రీ కళాశాల, రిజిస్ట్రర్ కార్యాలయం, కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మక్తల్ మండలంలోని గొల్లపల్లి –మంతన్‌గోడ్ బీటీరోడ్డు నిర్మాణానికి రూ. 1.50కోట్లు, చిట్యాల – గుర్రందొడ్డి మార్గంలో వంతెన నిర్మాణానికి రూ. 20కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మక్తల్‌లో నిర్మిసు న్న 150 పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదే విధంగా 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, టౌల్ హాల్ నిర్మాణాలకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.


