మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా పరేడ్ మైదానంలోని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫూల్‌లో ఆధునిక వాహనాల మరమ్మతుల కోసం నూతనంగా ఏర్పాటు చేసి టూపోస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్‌ను సోమవారం డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీస్ విభాగంలో వాహనాల నిర్వహణ అత్యంత కీలకమని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు సిద్ధంగా ఉండటం చాలా అవసరమన్నారు. ఈ టూ పోస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్ వల్ల వాహనాలను సులభంగా పైకి ఎత్తడం, తక్కువ సమయంలో మరమ్మతులు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి, అదనపు ఎస్పీ సురేష్‌కుమార్, డీఎస్పీలు రమణారెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


