● రూ.18.80 కోట్లు
కేటాయించిన ప్రభుత్వం
● మరోవైపు మిషన్ భగీరథకు కొనసాగుతున్న ఎత్తిపోతలు
● ప్రస్తుతం 821 అడుగుల ఎత్తులో శ్రీశైలం బ్యాక్‌వాటర్
● బ్యాక్‌వాటర్ భారీగా తగ్గిపోవడంతో అనుకూలంగా భావన
వచ్చే నెలలో కేఎల్‌ఐ మోటార్ల మరమ్మతుకు అధికారుల చర్యలు
కేఎల్‌ఐలో మరమ్మతుకు గురైన మోటార్లు ఇవే..
కొల్లాపూర్: గత కొన్నేళ్లుగా మరమ్మతుకు నోచుకోని కేఎల్‌ఐ మోటార్లకు ఈసారి తప్పనిసరిగా చేపట్టాలనే పట్టుదలతో అధికారులు ఉన్నారు. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈసారి శ్రీశైలం బ్యాక్‌వాటర్ మార్చి నెలలోనే భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఇదే అనువైన సమయం అని నీటిపారుదల శాఖ భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో మరమ్మతు చేపట్టే అవకాశం ఉందని, లేదంటే మరో ఏడాది ఆగాల్సిందేనని వారు పేర్కొంటున్నారు.
నిధుల కేటాయింపు
కేఎల్‌ఐలో పాడైన మోటార్ల మరమ్మతుకు గతేడాది ప్రభుత్వం రూ.18.80 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మూడో నంబర్ మోటార్ మరమ్మతు కోసం రూ.15 కోట్లు కేటాయించగా.. ఐదో నంబర్ మోటార్‌కు స్పిల్ భీమ్, కాంక్రీట్ వర్క్స్, సర్జిపూల్‌లోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట ఏర్పాటు కోసం రూ.3.80 కోట్లు కేటాయించింది.
ఎల్లూరు సమీపంలోని కేఎల్‌ఐ పంపుహౌజ్


