
సరస్వతీ నమస్తుభ్యం
– వివరాలు 9లో..
కందనూలు: జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం మూలనక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లాకేంద్రం సమీపంలోని శ్రీజ్ఞాన సరస్వతీమాత ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 108 మంది చిన్నారులతో అక్షరాభ్యాసం, 9మంది చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకారపు విశ్వనాథం, కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు నవీన్ కుమార్, పవన్ కుమార్, నితీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

సరస్వతీ నమస్తుభ్యం