
మూడు దశల్లో ‘పంచాయతీ’
గ్రామ పంచాయతీకి సంబంధించి తొలి విడతలో అక్టోబర్ 17 నుంచి 31 వరకు 16 మండలాల పరిధిలోని 410 జీపీలతోపాటు 3,514 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 4 వరకు 28 మండలాల్లోని 611 జీపీలతోపాటు 5,546 వార్డులకు.. చివరి దశలో అక్టోబర్ 25 నుంచి నవంబర్ 8 వరకు 33 మండలాల పరిధిలోని 657 జీపీలతోపాటు 6,008 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మాత్రం తొలి విడతలో పోలింగ్ నిర్వహించడం లేదు. రెండు, మూడో విడతల్లోనే ఆ రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కాగా.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపడుతారు. కాగా.. పంచాయతీ ఎన్నికలకు గాను 2,363 పోలింగ్ కేంద్రాలు కేటాయించారు.