
నాన్నే.. సూపర్ హీరో
వెన్నుదన్నుగా నిలబడ్డారు..
నా చిన్నతనం నుంచి అన్ని విషయాల్లో మా నాన్నే ఆదర్శం. మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న మహదేవ్ చిన్నపాటి వ్యాపారం చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి చదువు ప్రాముఖ్యత తెలియజేశారు. నేను ఇంజినీరింగ్ అయిన తర్వాత ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా.. నేను నిర్దేశించుకున్న ఐఏఎస్ లక్ష్యాన్ని సాధించేందుకు అందులో చేరలేదు. ఆ సమయంలో నాన్నే నా వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. సివిల్స్ రెండు ప్రయత్నాల్లో సాధించలేకపోయా. ఈ సమయంలో నీ వెనకాల నేనున్నా అంటూ వెన్నుదన్నుగా నిలబడ్డారు. మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా.
– బీఎం సంతోష్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల
● జీవిత పాఠాల్లో తండ్రికి మించిన గురువు లేరు
● పిల్లల ప్రతి అడుగులో
వెన్నంటి ఉంటూ భరోసా
● భవితకు మార్గదర్శిగా ఉంటూ.. వారి ఎదుగుదలకు అహర్నిశలు కష్టపడే శ్రమజీవి

నాన్నే.. సూపర్ హీరో

నాన్నే.. సూపర్ హీరో