ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 2026 సెషన్‌ ఎన్‌సీవీటీ ఇంజనీరింగ్‌ ట్రెడ్స్‌లో 5వ విడత వాక్‌ – ఇన్‌ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన వారు ఆన్‌లైన్‌ ద్వారా అక్టోబర్‌ 15 ఉదయం 11 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్‌ 13 నుంచి 15వ తేదీ వరకు ఏటూరునాగారం కళాశాలలో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఉంటుందని వెల్లడించారు.

ఆదిసేవా కేంద్రం సందర్శన

వాజేడు: మండల కేంద్రంలోని ఆదిసేవా కేంద్రాన్ని పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో మంగళవారం సందర్శించారు. కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడిన ఆయన కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీఓ కేంద్రానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా కేంద్రాల పనితీరు ఉండాలని సూచించారు.

దేవాలయ అభివృద్ధికి

నివేదిక అందిస్తాం

● రాష్ట్ర దేవాదాయ ధర్మదాయశాఖ

కమిషనర్‌ హనుమంతరావు

హన్మకొండ కల్చరల్‌: పురావస్తుశాఖ ఆధీనంలోని వేయిస్తంభాల ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ ద్వారా కేంద్రానికి నివేదిక అందజేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు పేర్కొన్నారు. హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని మంగళవారం రాత్రి కమిషనర్‌ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆలయప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్‌కుమార్‌ ఆలయమర్యాదలతో, మహిళలు కోలాటాలు, వేదమంత్రోచ్చాటనలతో ఘనంగా స్వాగతించారు. రుద్రేశ్వరీ అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించుకున్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ.. దేవాలయంలో విద్యుత్‌ అలంకరణ బాగుందని ఉత్సవాల ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. దేవాలయ ఉద్యోగుల, ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలు గంగు ఉపేంద్రశర్మ వివరించగా.. పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement