అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

ములుగు : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి మంగళవారం అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలో అన్నపూర్ణాదేవికి కాంగ్రెస్‌ నాయకులు మిల్కూరి ఐలయ్య, సిద్ధం రాఘవేందర్‌ మంగళవారం పూజలు నిర్వహించగా పల్నాటి కోటి దంపతులు అన్నదానం చేశారు. ములుగులో రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి భాస్కర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రాకేశ్‌యాదవ్‌, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement