ఏటీసీలతో ఉపాధి | - | Sakshi
Sakshi News home page

ఏటీసీలతో ఉపాధి

Apr 6 2026 9:24 AM | Updated on Apr 6 2026 9:24 AM

ఏటీసీలతో ఉపాధి

కోర్సుల వివరాలు ఇలా..

అడ్వాన్స్‌ టెక్నాలజీపై

విద్యార్థుల ఆసక్తి

ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీలు) విప్లవాత్మక మార్పులు తేనున్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులను పారి శ్రామిక వేత్తలు, పారిశ్రామికులుగా తీర్చిదిద్దాలని, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు నూతనంగా జిల్లాలో ఏటూరునాగారం, వాజేడు మండల కేంద్రాల్లో రెండు ఏటీసీలను ఏర్పాటు చేశారు. ఐటీఐ విద్యార్థులతో పాటు ఏటీసీలో చేరే విద్యార్థులకు ప్ర త్యేక శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి పూర్తి అయిన విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఏటీసీల ముఖ్య ఉద్దేశం

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగు పర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతుంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ఆదాయం పెరగాలంటే నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎంతో కీలకం. స్కిల్స్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు. ఐటీఐల్లోని విద్యార్థులకు ఏసీటీల ద్వారా శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా టాటా గ్రూప్‌ వారితో అనుసంధానం అయ్యారు. టాటా కంపెనీ నైపుణ్యం శిక్షణపై ఆసక్తితో ఉన్న విద్యార్థులకు నేర్పించేందుకు ఆరు ట్రేడ్‌లను ముందుకు తీసుకొచ్చింది. రూ.35 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, సామగ్రిని ఏర్పాటు చేశారు. దీనిలో ఆరు రకాలుగా శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యం కలిగిన ట్రైనర్లను ఇక్కడ నియమించారు. టాటా టెక్నాలజీ సంస్థ ట్రైనింగ్‌ పూర్తి చేసిన వారిని వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందస్తుగానే అగ్రిమెంట్‌లు చేయించుకుని వెళ్తున్నారు. ఇప్పటికీ 38 మంది వరకు ఉద్యోగం పొందారు.

విద్యార్థులకు తప్పని తిప్పలు

జిల్లాలోని నిరుద్యోగులు, విద్యార్థులు ఏటీసీలో శిక్షణ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ స్థానికంగా వసతి, భోజన సౌకర్యం లేకపోవడంతో ఇక్కడికి వచ్చే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గతంలో ఐటీడీఏ ద్వారా ఇక్కడ మేనేజ్‌మెంట్‌ హా స్టల్‌ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇక్కడ ఉంటూ చదువుకునే వారు. ఇప్పుడు అలాంటి అవకా శం లేక అద్దెకు ఉండలేక, భోజన వసతి లేక, తల్లి దండ్రులను వదిలి వచ్చి ఇక్కడ ఉండలేక చదువుకు దూరం అవుతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఐటీడీఏ ద్వారా గిరిజన, గిరిజనేతర విద్యార్థిని, విద్యార్థులకు భోజనం, వసతి కల్పించాలని విద్యావేత్తలు, మేధావులు కోరుతున్నారు.

ఏడాది కోర్సులు

ఇండస్ట్రీయల్‌ రోబోటిక్స్‌ డిజిటల్‌ మాన్యుఫాక్చరింగ్‌ టెక్నీషియన్‌

మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ అండ్‌ ఆటోమేషన్‌

అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌

రెండేళ్ల కోర్సులు

అడ్వాన్స్‌డ్‌ సీఎన్‌సీ మెకానిక్‌ టెక్నీషియన్‌

బేసిక్‌ డిజైన్‌ అండ్‌ వర్చువల్‌ వెరిఫైయర్‌ మెకానికల్‌

మెకానిక్‌ ఎలక్ట్రికల్‌ వెహికిల్‌

జిల్లాలో రెండు కేంద్రాల ఏర్పాటు

వసతి, భోజనం లేక

విద్యార్థుల అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement