అర్జీలు@ 92 | - | Sakshi
Sakshi News home page

అర్జీలు@ 92

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

అర్జీలు@ 92

ప్రజావాణి, గిరివాణిలో వినతుల రాక

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరివాణి(గిరిజన దర్బార్‌)లో పలు సమస్యలపై ప్రజలు 92 దరఖాస్తులను అందజేశారు. ఇందులో ప్రజావాణిలో 32, గిరివాణిలో 60 అర్జీలను బాధితులు కలెక్టర్‌కు అందజేశారు. ఈ వినతులను స్వీకరించిన కలెక్టర్‌ దివాకర వాటిని పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్‌. మహేందర్‌జీ, సంపత్‌రావు, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, ఆర్డీఓ వెంకటేశ్‌, డీడీ జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వీకరించిన

కలెక్టర్‌ టీఎస్‌.దివాకర

పరిశీలించి వెంటనే

పరిష్కరించాలని ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement