2023లో దివ్యాంగుల పింఛన్ మంజూరు కాగా గతేడాది రెన్యూవల్ కోసం సదరం క్యాంపునకు వెళ్లాను. అంగవైకల్య శాతం తక్కువగా ఉందని 25శాతం మాత్రమే ఉన్నట్లు సర్టిఫికెట్ ఇవ్వగా పింఛన్ తొలగించారు. ఆరు నెలలుగా రావడం లేదు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్‌కు దరఖాస్తు ఇవ్వగా దివ్యాంగులకు కావాల్సిన శాతం కంటే తక్కువగా ఉందని వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఇస్తామని వివరించినట్లు తెలి పారు. ఉన్నతాధికారులు దయతలచి దివ్యాంగుల పింఛన్ ఇప్పించి ఆదుకోవాలి.
– బొర్ర నర్సయ్య, కమలాపురం, మంగపేట
●


