మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
7
ములుగు: ఆస్తిపన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమే్‌శ్ తెలిపారు. పట్టణంలో సిబ్బందితో కలిసి ఆస్తి పన్నులను ఆయన సోమవారం వసూలు చేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ గత నెల 31లోపు ఇంటి పన్ను పూర్తిగా చెల్లించిన వారికి ఎర్లీ బర్డ్ స్కీం రాయితీ వర్తిస్తుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం బకాయిలను చెల్లించనివారు బకాయిలను చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటి పన్ను పూర్తిగా చెల్లిస్తేనే రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ములుగు పట్టణ ప్రజలు 5 శాతం తగ్గింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆస్తి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు.


