పూర్తి కమిటీలు ఎప్పుడు? | - | Sakshi
Sakshi News home page

పూర్తి కమిటీలు ఎప్పుడు?

Mar 22 2026 1:33 AM | Updated on Mar 22 2026 1:33 AM

డీసీసీ అధ్యక్షులను నియమించి నాలుగు నెలలు

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో మాత్రం ఇంకా పూర్తిస్థాయి కార్యవర్గం, కమిటీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్‌ ప్రెసిడెంట్లు, జనరల్‌ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృతస్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 2025, నవంబర్‌ 22న ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాతో ఆగిపోయింది. పూర్తిస్థాయి కమిటీలకు మోక్షం కలగకపోగా, పార్టీ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ కొనసాగుతోంది.

నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులు..

డీసీసీ అధ్యక్షుల్లో ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాల్లో ఇద్దరు షెడ్యూల్‌ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్‌, ఒక షెడ్యూల్‌ తెగలకు చెందిన వారికి పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ‘కుడా’చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డిని నియమించగా, వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్‌ అయూబ్‌కు అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో కీలక ప్రజాప్రతినిధులు అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా లకావత్‌ ధన్వంతి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్‌, మహబూబాబాద్‌కు ఎమ్మెల్యే మురళి నాయక్‌ భార్య ఉమలను ఖరారు చేయగా, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రెండోసారి పైడాకుల అశోక్‌కు దక్కింది. డీసీసీ అధ్యక్షుల సంధర్భంగా హనుమకొండ, ములుగు జిల్లాలు మినహా.. మిగతా నాలుగు జిల్లాల్లో సీనియర్‌లు అలకకు గురికాగా, కేడర్‌లో తర్జన భర్జన జరిగింది. ఈ నేపథ్యంలో అందరినీ అధిష్టానం బుజ్జగించింది. తాజాగా పూర్తిస్థాయి కమిటీల కూర్పు విషయం వచ్చే సరికి మళ్లీ రాజకీయ సిఫారసులు పెరగడం తలనొప్పిగా మారుతుందన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది.

పూర్తిస్థాయి కార్యవర్గంపై

ఇంకా గందరగోళం

పొరుగు జిల్లాల్లో కార్యవర్గం,

కమిటీల ఖరారు

ఉమ్మడి వరంగల్‌లో

ముందుకు కదలని పరిస్థితి

ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement