ములుగు: జిల్లా వ్యాప్తంగా రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్) వేడుకలను శనివారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే ఈద్గా, మసీదులకు చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని జామా మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్దకు చేరుకొని ప్రార్థనలు చేసి పితృదేవతలను స్మరించుకున్నారు. అనంతరం ముస్లింలు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాయ్ బలాయ్ తీసుకున్నారు. రంజాన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అలాగే జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు అఫ్రోజ్ ఇంట్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు.


