ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని నార్లాపూర్ సమీపంలో గల తక్కళ్లగూడెంలోని ఆదివాసీ పిల్లల విద్యాభివృద్ధికి స్థాపించిన భీమ్ చిల్డ్రన్ హ్యాపినెస్ సెంటర్ (బీసీహెచ్‌సీ)ను ట్రెయినీ డీఎస్పీలు గుడెల్లి సృజన, దైనంపల్లి ప్రవీణ్‌కుమార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్‌లో చదువుతున్న చిన్నారులతో పాటు గ్రామస్తులతో వారు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యా ప్రాముఖ్యతను వివరించడంతో పాటు ఏజెన్సీలోని సాధ్యమయ్యే సామాజిక మార్పులను వివరించారు. భీమ్ చిల్డ్రన్ హ్యాపినెస్ సెంటర్ చేస్తున్న సేవలను అభినందించారు. ముఖ్యంగా డ్రాయింగ్‌లో చూపుతున్న ప్రతిభను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ సభ్యులు సంతోష్, దైనంపల్లి ప్రకాశ్, శ్రీలత, కల్పన, రక్షిత, సాయికుమార్, లావణ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కన్నాయిగూడెం: మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ పరిధిలో గల వివిధ గ్రామాలకు నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఏఈ స్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం కన్నాయిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణంగా 8.30 నుంచి ఒంటిగంట వరకు విద్యుత్‌సరఫరాను నిలిపివేయనున్నట్లు వివరించారు.


