ములుగు: మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ది పనులు చేపట్టేందుకు 2026–27 సంవత్సరానికి గాను రూ.20.72 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించినట్లు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళభిక్షపతి తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిలర్లు, సంబంధిత అధికారులతో సోమవారం బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీకి సంబంధించిన ఆదాయ, వ్యయాల అంచనాలను పరిశీలించి బడ్జెట్‌ను రూపొందించి ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ మున్సిపాలిటీకి పన్నుల ద్వారా రూ.3.52 కోట్లు, ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా రూ.17.20 కోట్లు అందనున్నట్లు అంచనా వేసి మొత్తం రూ.20.72 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించి ఆమోదించినట్లు వివరించారు.
ఈ బడ్జెట్ ద్వారా పట్టణంలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మెరుగుపర్చడానికి ఉపయోగించనున్నట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రమేశ్, వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహీన్ రియాజ్‌మీర్జా, కౌన్సిలర్లు నల్లెల్ల స్వాతి, గుంటోజు పావని, గండ్రకోట వాణి, ఓంప్రకాశ్, పోరిక రాజు, యాసం వసంత, గుగ్గిల్ల దివ్య, బైకాని సునిత, నవీన్, సాంబయ్య, భరత్, కుత్బుద్దీన్, పద్మ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్‌కు ప్రణాళిక
మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ


