ఎస్‌ఎస్ తాడ్వాయి: మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మలను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సోమవారం దర్శించుకున్నారు. అమ్మవార్లకు పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతి గొప్పగా ఆదివాసీ జాతరగా ఉండటం అభినందనీయమన్నారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దగ్గరికి వచ్చి దర్శించుకోవడం గొప్ప తరుణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌పీ జాతీయ నాయకులు మంద కుమార్, పుట్ట రవి, గుగిళ్ల పీరయ్య, వేల్పుల సూరన్న, జిల్లా అధ్యక్షుడు మడిపల్లి శ్యాంబాబు, జిల్లా అధికారి ప్రతినిధి గజ్జల ప్రసాద్, ఎమ్మార్పీఎస్ నాయకులు కరుణాకర్, చంద్రమౌళి, స్వామి, ప్రశాంత్, రవీందర్, శ్యామ్, మల్లేష్, తిరుపతి, రాంబాబు, దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.


