ఏటూరునాగారం: మండలంలోని శంకరాజుపల్లిలో సోషియో, ఎకనామిక్ సర్వే నిర్వహించినట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం శంకరాజుపల్లిలో సర్వేను చేపట్టారు. ఆదాయం, విద్య, వృత్తి, నివాస స్థితి, జీవన పరిస్థితులపై సమాచారం సేకరించడానికి సర్వే చేపట్టామన్నారు. ఇది ప్రభుత్వాలకు సంక్షేమ పథకాలు, విధానాలను రూపొందించడానికి సహాయ పడుతుందన్నారు. పర్యవేక్షణ చేసి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారులు భూక్య లాల్‌నాయక్, రమేష్ బాబు, లక్ష్మీనారాయణ, ఎంపీఎస్‌ఓలు వంశీ, నాగరాజు, తిరుపతి, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


