పథకాల అమలుకు జనగణన కీలకం | - | Sakshi
Sakshi News home page

పథకాల అమలుకు జనగణన కీలకం

Mar 17 2026 7:28 AM | Updated on Mar 17 2026 7:28 AM

పథకాల అమలుకు జనగణన కీలకం

ములుగు: దేశాభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుకు జనాభా గణన–2027 కీలకమని జిల్లా జనాభా లెక్కల అధికారి, సీపీఓ ప్రకాశ్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ సమావేశ మందిరంలో సోమవారం జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సెస్స్‌ ఆపరేషన్‌న్‌ కార్యాలయానికి చెందిన గణాంక అధికారులు హోబాలాల్‌, సరళ సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో జనాభా గణన–2027 నిర్వహణకు సంబంధించి జిల్లా, మండల, మున్సిపల్‌ స్థాయి అధికారులకు గణన ప్రక్రియపై పలు సూచనలు చేసి అవగాహన కల్పించారు. ఈ సారి దేశంలో తొలిసారిగా జనాభా గణనను డిజిటల్‌ విధానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొబైల్‌ యాప్‌లు, వెబ్‌ పోర్టల్‌ ద్వారా గణన ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. అదేవిధంగా ప్రతీ మండలంలోని రెవెన్యూ గ్రామాలు, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా విభజించే విధానం, గణన నిర్వహణకు సంబంధించిన విధానాలపై అధికారులకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో గణాంక అధికారి లాల్‌, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

జిల్లా జనాభా లెక్కల అధికారి ప్రకాశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement