బాలల రక్షణపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

బాలల రక్షణపై అవగాహన కల్పించాలి

Mar 17 2026 7:28 AM | Updated on Mar 17 2026 7:28 AM

ములుగు: బాలల రక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు పేర్కొన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాస్థాయి బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్‌రావు హాజరై మాట్లాడారు. జిల్లాలో నూతనంగా బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా, 14 మంది జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారని వివరించారు. జిల్లాలో ఉన్న మండల, గ్రామ, వార్డులలో ఉన్న బాలల పరిరక్షణ కమిటీలను సమన్వయం పరుస్తూ, బాలలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తుందని వెల్లడించారు. జిల్లాలోని బాలల రక్షణపై అవగాహన కల్పించడం, ఆరేళ్లకు పైబడిన బాలలందరూ బడికి వెళ్లేలా చూడడం, బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి బడిలో చేర్పించడం, బాలల హక్కులకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు తదితర విషయాలపై అవగాహన కార్యక్రమాలను కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులతో కలిసి అదనపు కలెక్టర్‌ బాలల సంరక్షణ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్‌, బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement