ములుగు రూరల్: గర్భిణులకు పౌష్టికాహారం అవసరమని, ఆరోగ్య కార్యకర్తలు పౌష్టికాహార ప్రాముఖ్యతను వారికి వివరించాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు సూచించారు. ఈ మేరకు సోమవారం కుటుంబ సంక్షేమం, ప్రజా ఆరోగ్య కమిషనర్ ఆదేశాల మేరకు ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక ప్రమాద గర్భదారణ మహిళలను గుర్తించాలన్నారు. వారికి ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఏఎన్‌సీ క్లినికల్, విలేజ్ న్యూట్రిషన్ డేలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శరీర శ్రమతో పాటు వైద్యుల సలహాలతో మందులు తీసుకోవాలన్నారు. నార్మల్ డెలివరీతో కలిగే లాభాలు, ఆపరేషన్లతో ఉండే నష్టాలను వివరించాలన్నారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. మాతృ, శిశు మరణాలను తగ్గించడంపై సూచనలు చేశారు. గర్భాధారణ క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్‌కు 14ఏళ్ల వయసు కలిగిన బాలబాలికలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సంతోషి, విద్యాసాగర్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, నాగఅన్వేష్, మాస్ మీడియా అధికారి సంపత్, తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు


