ములుగు రూరల్: సమగ్ర శిక్షణ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోడెం సమ్మయ్య అన్నారు. సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ సంపత్‌రావుకు వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ 15 ఏళ్లుగా చాలిచాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. కేజీబీవీలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది స్పెషల్ అధికారులు, విద్యావనరుల కేంద్రంలోని కంప్యూటర్ ఆపరేటర్లు సీఆర్‌పీలకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం రాజేందర్, స్వరూప, కరుణాకర్, కుమార్, ప్రవీణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


