పిలవకున్నా వస్తే.. | - | Sakshi
Sakshi News home page

పిలవకున్నా వస్తే..

Mar 16 2026 7:26 AM | Updated on Mar 16 2026 7:26 AM

శుభకార్యాలకు పిలవకున్నా వెళ్లి భోజనం చేసేవారికి ఆదివారం భూపాలపల్లి పట్టణం సుభాష్‌కాలనీ సింగరేణి ఫంక్షన్‌ హాల్‌ ఎదుట హెచ్చరిక బోర్డు పెట్టారు. సింగరేణి ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం వివాహం జరిగింది. ఫంక్షన్‌ హాల్‌లో ఎలాంటి కార్యక్రమం జరిగినా ఫంక్షన్‌కు సంబంధం లేనివారు వందలాది మంది వచ్చి భోజనాలు చేస్తున్నారని నిర్వాహకులు గుర్తించారు. దీంతో ఇతరులెవరూ రాకుండా ఫంక్షన్‌ హాల్‌ ఎదుట ‘వివాహానికి సంబంధం లేనివారు వస్తే రూ.5వేల జరిమానా, 3నెలల జైలు’ అని ఫ్లెక్సీ పెట్టారు. భోజన ప్రియులు బోర్డును చూసి వెనుదిరిగి వెళ్లారు. గతంలో శుభకార్యాలు చేసినప్పుడు భోజనాలు సరిపోక ఇబ్బందులు అయ్యేవని.. ఫ్లెక్సీ ఏర్పాటుతో అందరికీ భోజనాలు సరిపోయాయని నిర్వాహకులు అన్నారు.

– భూపాలపల్లి రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement