పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం

Mar 16 2026 7:26 AM | Updated on Mar 16 2026 7:26 AM

ములుగు రూరల్‌: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని కలెక్టర్‌ టీఎస్‌.దివాకర అన్నారు. ఈ మేరకు ఆదివారం మల్లంపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులతో పాటు కలెక్టర్‌ను అధికారులు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ ఆరోగ్యాన్ని కాపాడేందుకు కష్టపడుతున్న నిజమైన సేవకులు పంచాయతీ కార్మికులని కొనియాడారు. మండల పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హనుమంతరావు, సీడీపీఓ శిరీష, సర్పంచ్‌ శ్యాంరావు, కార్యదర్శి పోలురాజు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement