● మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
● ఉప సర్పంచ్ వేధింపులే కారణమని
ఆరోపణ
ములుగు రూరల్: జీపీ కా ర్యాలయంలో తనకు ప్రత్యే క గది, కుర్చీ ఏర్పాటు చేయించాలని ములుగు మండలం జాకారం ఉప సర్పంచ్ వేధిస్తున్నాడని మహిళా సర్పంచ్ సమత గురువారం రాత్రి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు సమతను ములుగు జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈసందర్భంగా సమతతో శుక్రవారం సాక్షి మాట్లాడించగా ఉపసర్పంచ్ తనను ప్రతీ పని కి అడ్డుపడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఎన్నికల అనంతరం ప్రమాణస్వీకా ర కార్యక్రమంతోపాటు పారిశుద్ధ్య పనుల నిమిత్తం పనిముట్లు, చెత్త సేకరణ వాహన డీజిల్ ఖర్చులకు రూ.40 వేలు బిల్లు పెట్టడంతో.. నాకు తెలియకుండా ఎలా బిల్లు తయారు చేస్తారని, పంచాయతీలో ఏ పని చేసినా తనకు తెలియకుండా చేయకూడదని దురుసుగా మాట్లాడడంతో మనస్తాపానికి గురైన ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
నాకు సంబంధం లేదు: ఉపసర్పంచ్
సర్పంచ్ సమత ఆత్మహత్యాయత్నానికి నాకు సంబంధం లేదు. వారి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు యత్నించి నాపై ఆరోపణలు చేస్తున్నారు. గత సోమవారం పంచాయతీ జనరల్ బాడీ సమావేశంలో ఉప సర్పంచ్‌గా కుర్చీ ఏర్పాటు చేయాలని కోరాను. కానీ, గురువారం ఆత్మహత్యకు యత్నిస్తే నేను కారణమని ప్రచారం చేయడం సరికాదు.


