వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని ఇంగ్లండ్‌కు చెందిన క్రిష్టోఫర్ శుక్రవారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్‌కుమార్ వివరించగా శిల్పాకళాసంపద బాగుందని కొనియాడారు.
గిరిజన విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏపీఓ
ఏటూరునాగారం: వాజేడు మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ వసంతరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో విద్యార్థుల సౌకర్యాలు, వసతులపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందించాని ఆదేశించారు. విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, లైట్లు, మరుగుదొడ్లు, మూత్రశాలల పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. సౌకర్యాల లేమితో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అందుకు యజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పించి విద్యావంతులు చేయాలని ఆదేశించారు. తరగతి గదులు, వంటశాల, ఆహార భద్రత గోదాంలు, రికార్డులను పరిశీ లించారు. జేడీఎం కొండల్‌రావు, ఉన్నారు.
అర్చకులపై కులాల
ప్రస్తావన తగదు
మంగపేట : మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలోని బ్రాహ్మణ అర్చకులపై కులాల ప్రస్తావనతో ఫిర్యాదులు చేయడం తగదని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో అర్చకుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తణుగుల రత్నాకర్, జిల్లా బ్రాహ్మణ సేవాసమితి నాయకులతో కలిసి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వారు విలేకరులతో మాట్లాడారు. హేమాచల క్షేత్రం రిటైర్డ్ అర్చకుడు, భద్రాచలం దేవస్థానం అర్చకులు బ్రాహ్మణ వర్గానికి చెందిన అర్చకులపై కులాల ప్రస్తావన తీసుకురావడం, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడం సమంజసం కాదన్నారు. బ్రాహ్మణ శ్రీవైష్ణవ ఆరాధ్య మాధ్యనియోగి శాఖలు బ్రాహ్మణ శాఖల కిందకే వస్తాయన్నారు. అర్చకుల మధ్య నెలకొన్న పంచాయితీని వైష్ణవ పాంచరాత్ర ఆగమ పండితుడు చిన్న జీయర్ స్వామి సమక్షంలోనే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్‌కు వినతి ఇచ్చామని దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ సేవాసమితి నాయకులు సూర్చనారాయణ శర్మ,నాగేశ్వర్‌రావు శర్మ, మణికంట శర్మ, వాసుదేవమూర్తి, ఏడునూతుల ఋశ్వర్‌చంద్, అనిపెద్ది మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, వెంకటనారాయణశర్మ, తదితరులు పాల్గొన్నారు.
అవగాహన సదస్సు
భూపాలపల్లి అర్బన్: ఆర్మీ నియామకాలపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించా రు. సికింద్రాబాద్ కేంద్రానికి చెందిన ఆర్మీ అధికారులు జశ్వంత్‌సింగ్, మనీష్‌కుమార్ హా జరై అగ్నివీర్ నియామకాలపై వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆర్మీలో చేరడానికి ఉన్న అవకాశాలు, అర్హతలు, ఎంపిక విధా నం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం పై అవగాహన కల్పించారు.


