గోవిందరావుపేట: విద్యార్థుల్లో అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంపొందించేందుకు మోడల్ ఐక్యరాజ్యసమితి వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని డీఈఓ సిద్ధార్థరెడ్డి అన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ, జిల్లా సాంఘిక శాస్త్ర ఉ పాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ మోడ ల్ స్కూల్ చల్వాయిలో జిల్లాస్థాయి మోడల్ ఐక్యరాజ్యసమితి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై అవగా హ న కలిగి ఉండాలన్నారు. ఐక్యరాజ్యసమితి విధానా లు, అంతర్జాతీయ సంస్థల పనితీరుపై విద్యార్థుల కు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి దేశ విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని, ఐ క్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో కూ డా సేవలందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించా రు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులను హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర స్థా యి మోడల్ ఐక్యరాజ్యసమితి కార్యక్రమానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఐక్యరాజ్యసమితిలో ఉండే జనరల్ అసెంబ్లీ, యూనిసెఫ్, యునె స్కో వంటి సంస్థల ప్రతినిధులుగా మారి పూర్తిగా ఆంగ్లంలో ప్రసంగించడం విశేషమన్నారు. అనంత రం పలవురు విద్యార్థులు మాట్లాడుతూ.. జిల్లాస్థాయి మోడల్ ఐక్యరాజ్యసమితిలో పాల్గొనడం త మలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నారు. కార్యక్రమంలో శ్యాంసుందర్ రెడ్డి, రామకృష్ణ, ఏడుకొండలు, శ్రీహర్షం రాజు, సాంబయ్య, నాగేశ్వరరావు, కమలాకర్, పాయం వీరనారయణ, గొంది దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ సిద్ధార్థరెడ్డి


