ములుగు రూరల్: పోలీస్ స్టేషన్లలో కేసులను నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి భాదితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ములుగు, ఏటూరునాగారం డివిజన్ల పోలీస్ అధికారులతో జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించని నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పరిష్కరించబడని కేసులపై సమగ్ర సమీక్ష చేపట్టారు. నేర తీవ్రత ఎక్కువ కలిగిన కేసులు, ఆస్తి సంబంధిత కేసులను పరిశీలించారు. మహిళలు, ఫోక్సో కేసులపై ప్రత్యేక చొరవ చూపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఎన్‌డీపీఎస్ కేసులు, అక్రమ ఇసుక రవాణ, ఐడీ లిక్కర్, ఐఎంఎఫ్‌ఎల్ అక్రమాలు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ జాగ్గరీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నేరనియంత్రణకు ప్రతీ పోలీస్ బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. మళ్లీ నేరసమీక్ష సమావేశం వరకు పురోగతి లేకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీ కిషోర్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శంకర్, సీఐలు సురేష్ కుమార్, దయాకర్, ముత్యం సురేష్, ఆయా డివిజన్ల పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


