వెంకటాపురం(కె): వైద్యశాఖలో విధులు నిర్వహించే ఉద్యోగులు యాప్‌లో అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలని డీసీహెచ్‌ఎస్ (డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఫర్ హాస్పటల్ సర్వీసెస్) జగదీశ్వర్ అన్నారు. మండల కేంద్రంలోని వైద్యశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వైద్యశాలలో పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ల్యాబ్, ఎక్స్ రే విభాగాల్లో యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయా.. అని పరిశీలించారు. ఎండలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వాతావరణానికి అనుకూలంగా డయోరియా, డీ హైడ్రేషన్, వడదెబ్బ తగిలిన రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని అన్నారు. అవసరమైన వార్డుల్లో ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలను అందించాలని అన్నారు. కార్యక్రమంలో ఏటూరునాగారం సూపరింటెండెంట్ సురేష్‌కుమార్, తదితరులు ఉన్నారు.
డీసీహెచ్‌ఎస్ జగదీశ్వర్


