బస్టాండ్‌ను అందుబాటులోకి తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌ను అందుబాటులోకి తీసుకురావాలి

Mar 14 2026 7:26 AM | Updated on Mar 14 2026 7:26 AM

బస్టాండ్‌ను అందుబాటులోకి తీసుకురావాలి సౌకర్యాలు కల్పించాలి

మోడ్రన్‌ బస్టాండ్‌ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలి. ఏడాది కావస్తున్నా బస్టాండ్‌ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. అసంపూర్తి బస్టాండ్‌ నిర్మాణంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురువుతున్నారు. బస్టాండ్‌ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలి. బస్టాండ్‌ నిర్మాణ పనుల్లో జాప్యం జరిగితే సంబంధిత కాంట్రాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలి.

– కొత్త సురేందర్‌, కౌన్సిలర్‌

తాత్కాలిక బస్టాండ్‌ వద్ద ప్రయాణికుల కోసం అధికారులు కనీస వసతులు కల్పించాలి. ఎండాకాలం కావడంతో తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతీరోజు వందలాది మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు విఫలమవుతున్నారు. దాతలైనా స్పందించి తాత్కాలిక బస్టాండ్‌ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.

– నూనె శ్రీనివాస్‌, ప్రయాణికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement